Chandrababu: టీడీపీ రావడం ఒక రాజకీయ అనివార్యం.. వేడుకలు ఘనంగా నిర్వహించండి: చంద్రబాబు

Chandrababu advices TDP cadre to celebrate party 40th formation day in a grand way
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 40 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29న ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని ఆయన చెప్పారు. అప్పట్లో టీడీపీ రావడం ఒక రాజకీయ అనివార్యమని అన్నారు.

ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ... జాతీయ భావాలతో సాగే పార్టీ టీడీపీ అని చెప్పారు. పార్టీ చారిత్రక ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చేలా టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని చెప్పారు. ఏపీకి టీడీపీ అవసరం ఏంటో ప్రజలందరికీ వివరించేలా కార్యక్రమాలు కొనసాగాలని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
40th Formation Day

More Telugu News