అప్పుడు రూ.20 లక్షలు డిమాండ్ చేసి.. ఇప్పుడు రూ.2 లక్షలిస్తారా?: జగన్‌కు లోకేశ్ ప్రశ్న
- భాకరాపేట ప్రమాదాన్ని ప్రస్తావించిన లోకేశ్
- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ప్రకటించడంపై నిరసన
- ట్విట్టర్ వేదికగా జగన్‌ను విమర్శించిన లోకేశ్
ఈ అంశానికి సంబంధించి చిత్తూరు జిల్లా భాకరాపేట రోడ్డు ప్రమాదాన్ని లోకేశ్ ప్రస్తావించారు. భాకరాపేట ప్రమాదంలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ జగన్ సర్కారు చేసిన ప్రకటనను లోకేశ్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా జగన్ మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని లోకేశ్ ఎద్దేవా చేశారు.