వివాదంలో ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా దర్శకుడు.. 'భోపాలీ' పదానికి వివేక్ చెప్పిన అర్థంపై ఆగ్రహం!
- తాను భోపాల్ వాడినన్న విషయాన్ని ఎక్కడా చెప్పనన్న వివేక్ అగ్నిహోత్రి
- భోపాల్ ప్రజల్లో నవాబుల ప్రవర్తన ఉంటుందన్న దర్శకుడు
- బహుశా ఆయనకు అలాంటి అలవాటు ఉండొచ్చన్న దిగ్విజయ్ సింగ్
వివేక్ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో విమర్శలు చుట్టుముట్టాయి. పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీ ప్రజలు, నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వివేక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు అలాంటి అనుభవం ఉందేమో కానీ భోపాల్ వాసులకు అలాంటి అలవాటు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కౌంటరిస్తూ ఆయన వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు.