వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది: ప్రకాశ్ రాజ్
Add ap7am to your home Screen

వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది: ప్రకాశ్ రాజ్

Prakash Raj says he will proud of RRR team
  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్
  • నీరాజనాలు పడుతున్న జనాలు
  • సినిమా బ్రహ్మాండంగా ఉందన్న సినీ ప్రముఖులు
  • ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలిపిన ప్రకాశ్ రాజ్
అభిమానులు ఎప్పటినుంచో చూస్తున్న రోజు రానే వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అని అభివర్ణిస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

కాగా, ఈ చిత్రంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త హద్దులు ఏర్పాటు చేశారని కితాబునిచ్చారు. 

దర్శకుడు అనిల్ రావిపూడి స్పందిస్తూ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల రూపంలో రెండు తుపాకీలతో రాజమౌళి గురిపెట్టారని వ్యాఖ్యానించారు. బాక్సాఫీసు రికార్డులు బద్దలయ్యేందుకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
Prakash Raj
RRR
Rajamouli
Ramcharan
NTR
Tollywood

More Telugu News