కాగితాలు చించి ఉపాస‌న‌పై వేసిన ఫ్యాన్స్‌.. థియేట‌ర్లో ఫుల్ ఎంజాయ్ చేసిన చెర్రీ భార్య‌.. వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాగితాలు చించి ఉపాస‌న‌పై వేసిన ఫ్యాన్స్‌.. థియేట‌ర్లో ఫుల్ ఎంజాయ్ చేసిన చెర్రీ భార్య‌.. వీడియో ఇదిగో

upasana video goes viral
  • హైద‌రాబాద్‌లోని భ్ర‌మ‌రాంభ థియేట‌ర్‌కు చ‌ర‌ణ్ దంప‌తులు
  • థియేట‌ర్లో ఫ్యాన్స్ హంగామా
  • వారితో క‌లిసి కాగితాలు విసిరేసిన ఉపాస‌న‌
రామ్ చ‌ర‌ణ్, జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా నేడు విడుద‌లైన నేప‌థ్యంలో పలువురు ప్ర‌ముఖులు కూడా ఈ మూవీని చూసేందుకు థియేట‌ర్ల‌కు వెళ్లారు. హైద‌రాబాద్‌లోని భ్ర‌మ‌రాంభ థియేట‌ర్‌లో  సినిమా చూసేందుకు రామ్ చ‌ర‌ణ్ త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా థియేట‌ర్లో ప్రేక్ష‌కులు ఉత్సాహంతో పెద్ద ఎత్తున కాగితాలు చించి ఉపాస‌నపై విసిరేశారు. 

దీంతో ప్రేక్ష‌కుల‌తో క‌లిసి ఉపాస‌న కూడా ఎంజాయ్ చేసింది. కింద ప‌డిన కాగిత‌పు ముక్కుల‌ను తీసుకుని ఆమె కూడా పైకి విసిరేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. కాగా, అంత‌కు ముందు భ్ర‌మ‌రాంభ థియేట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు కాలు పెట్టిన స‌మ‌యంలో వారిని చూసేందుకు అభిమానులు ఎగ‌బ‌డ్డారు.
upasana
Viral Videos
Tollywood

More Telugu News