Virat Kohli: ఐపీఎల్‌లో ధోనీతో దిగిన ఫొటోను పోస్ట్ చేసి.. కోహ్లీ భావోద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు

kohli on dhoni captaincy
ఐపీఎల్ లో చెన్నై సూపర్‌ కింగ్స్ సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి మహేంద్ర సింగ్‌ ధోనీ త‌ప్పుకోవ‌డంపై క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. గ‌తంలో ఐపీఎల్ సంద‌ర్భంగా తాను ధోనీతో దిగిన ఫొటోను ఆయ‌న పోస్ట్ చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోనీ అత్యుత్తమంగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడ‌ని కోహ్లీ కితాబునిచ్చాడు. 

ప‌సుపు రంగు జెర్సీలో దిగ్గజ సార‌థిగా కొనసాగాడ‌ని, ధోనీ చరిత్రను అభిమానులు ఎప్పటికీ మర్చిపోరని చెప్పాడు. ధోనీ అంటే త‌న‌కు ఎప్పుడూ అమితమైన గౌరవమే అని కోహ్లీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి మహేంద్ర సింగ్‌ ధోనీ త‌ప్పుకోవ‌డంపై ప‌లువురు క్రికెట‌ర్లు ఇలాగే స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ కూడా రాయల్‌ ఛాలెంజర్స్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విష‌యం తెలిసిందే.
Virat Kohli
MS Dhoni
Cricket

More Telugu News