Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 72 క‌రోనా కేసులు.. వివ‌రాలివిగో!

telangana corona daily updates
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,072 కరోనా పరీక్షలు నిర్వహించగా, 72 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 35 కొత్త కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో కరోనా కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 50 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,989 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,241 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 637 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.
Telangana
Corona Virus

More Telugu News