దుమ్మురేపిన సితార, మహేశ్ బాబు... పెన్నీ సాంగ్ ఆల్ టైమ్ రికార్డు
Add ap7am to your home Screen

దుమ్మురేపిన సితార, మహేశ్ బాబు... పెన్నీ సాంగ్ ఆల్ టైమ్ రికార్డు

Mahesh Babu and Sithara featured Penny Song sets all time record
  • సర్కారు వారి పాట నుంచి రెండో పాట
  • తమన్ బాణీలకు అనంత శ్రీరామ్ సాహిత్యం
  • పాటలో తళుక్కుమన్న సితార పాప
  • 24 గంటల్లో కోటికి పైగా వ్యూస్
మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలోని పెన్నీ సాంగ్ యూట్యూబ్ ను ఊపేస్తోంది. నిన్న యూట్యూబ్ లోకి వచ్చిన ఈ పాట ఇవాళ్టికి 1.8 కోట్ల వ్యూస్ తో ఆల్ టైమ్ రికార్డు అందుకుంది. కేవలం 24 గంటల్లోనే ఈ ఘనత అందుకుంది. ఈ పాటలో మహేశ్ బాబు ముద్దుల తనయ సితార స్టెప్పులను కూడా యాడ్ చేయడంతో అభిమానుల జోష్ కు అడ్డులేకుండా పోయింది. బ్యాంకు స్కాం నేపథ్యంలో తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం సారాంశం అంతా ఈ పాటలోనే ఉండడంతో ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తోంది.


దీనికి సంబంధించిన మ్యూజిక్ వీడియోలో సితార పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఈ పాటకు తమన్ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చాడు. టెక్నో పాప్ తరహాలో పాట సాగగా, సితార డ్యాన్స్ మూవ్ మెంట్స్ సైతం అందుకు అనుగుణంగా లయబద్ధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ మ్యూజిక్ వీడియోలో తండ్రితో కలిసి సితూ పాప అదరగొట్టింది. 

పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahesh Babu
Sithara
Penny Song
All time Record
Sarkaru Vaari Paata

More Telugu News