తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!

Telangana corona daily bulletin
  • గత 24 గంటల్లో 20,496 కరోనా పరీక్షలు
  • కొత్తగా 67 కేసుల నమోదు
  • హైదరాబాదులో 31 మందికి పాజిటివ్
  • 17 జిల్లాల్లో కొత్త కేసులు నిల్
  • ఇంకా 713 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,496 శాంపిల్స్ పరీక్షించగా, 67 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో 31, రంగారెడ్డి జిల్లాలో 10 కొత్త కేసులు గుర్తించారు. 17 జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 92 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,90,756 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,85,932 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 713 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Bulletin
Today Cases

More Telugu News