దూసుకుపోతున్న 'గని' ట్రైలర్!

Ghani Trailer Released
  • 'గని'గా వరుణ్ తేజ్ 
  • బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ 
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • ఏప్రిల్ 8వ తేదీన విడుదల
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి 'గని' సినిమాను రూపొందించాడు. అల్లు బాబీ .. సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాలో, వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ నటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై, దాదాపు ముఖ్య పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంది .. ఈ సినిమాపై అంచనాలు పెంచింది. చాలా వేగంగా ఈ ట్రైలర్ 6 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. లైక్స్ నెంబర్ కూడా చకచకా మారిపోతుండటం ఆశ్చర్యపరుస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. 

బాక్సింగ్ నేపథ్యంలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులుగా జగపతిబాబు .. నదియా నటించగా, ముఖ్యమైన పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర కనిపించనున్నారు.
Go Back to Shorts
Varun Tej
Saiee Manjrekar
Ghani Movie

More Telugu News