'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా డైరెక్టర్ కి 'వై' కేటగిరీ భద్రతను కల్పించిన కేంద్రం
- కశ్మీరీ పండిట్ల ఊచకోత కథాంశంగా చిత్రం
- డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి దుష్టశక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పు
- సీఆర్పీఎఫ్ బలగాలతో 'వై' సెక్యూరిటీ కల్పించిన కేంద్ర హోం శాఖ
ఇదిలావుంచితే, వివేక్ అగ్నిహోత్రికి దుష్టశక్తుల నుంచి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉండటంతో.. కేంద్ర హోం శాఖ ఆయనకు 'వై' కేటగిరీ భద్రతను కేటాయించింది. దేశంలో ఆయన ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను కల్పిస్తారు. ఇప్పటికే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కు 'వై' కేటగిరీ భద్రత ఉన్న సంగతి తెలిసిందే.