తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

Telangana records 75 new corona cases
  • గత 24 గంటల్లో 75 కరోనా కేసుల నమోదు
  • హైదరాబాదులో 34 కేసుల నిర్ధారణ
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 816
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 75 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. హైదరాబాద్ లో అత్యధికంగా 34 మంది కరోనాకు గురయ్యారు. కరోనా రికవరీ రేటు 99.37 శాతానికి పెరిగింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 7,90,574కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 7,85,647 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,111 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 816 యాక్టివ్ కేసులు ఉన్నాయి.   

Go Back to Shorts
Telangana
Corona Virus
Update

More Telugu News