సజ్జనార్ క్రియేటివిటీకి నెటిజన్ల ఫిదా.. ‘ఆర్ఆర్ఆర్’కి కొత్త భాష్యం.. వీడియో వైరల్!
- వినూత్న పథకాలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్న సజ్జనార్
- ఆర్ఆర్ఆర్ అంటే ‘రాష్ట్ర రోడ్డు రవాణా’గా కొత్త అర్థం
- ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ పాటను ప్రచారానికి వాడుకున్న సజ్జనార్
‘ఆర్ఆర్ఆర్’ను ‘రాష్ట్ర రోడ్డు రవాణా’గా మార్చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ సాంగ్‌ని కూడా ఆర్టీసీ ప్రచారానికి వాడుకున్నారు. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పట్టుకున్న జెండాపై ‘వందేమాతరం’ అని ఉండగా సజ్జనార్ మాత్రం వాటి స్థానంలో టీఎస్ఆర్టీసీ అని రాయడంతోపాటు దాని కింద బస్సు, లోగోను పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు ఆయన క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు.