తెలంగాణలో క్రమంగా తగ్గిపోతున్న కరోనా యాక్టివ్ కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
- తెలంగాణలో క్షీణ దశలో కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 24,848 కరోనా పరీక్షలు
- కొత్తగా 81 పాజిటివ్ కేసులు
- హైదరాబాదులో 35 కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 823
అదే సమయంలో 123 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,499 మంది కరోనా బారినపడగా, వారిలో 7,85,565 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 823 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనా ప్రభావంతో 4,111 మంది మరణించారు.

.