Suman: జగన్ మరో రెండు సార్లు సీఎం కావాల్సిందే: సినీ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు

Jagan has to become as CM for two more times says Suman
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చాలా బాగుందని సినీ నటుడు సుమన్ కితాబునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు పేదల్లో చిరునవ్వులు నింపాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే జగన్ మరో రెండు సార్లు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. ఒకే వ్యక్తికి మూడు సార్లు సీఎంగా అవకాశం ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సుమన్... అక్కడ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడి ఉంటామని సుమన్ అన్నారు. సినీ పరిశ్రమ బాగుండటానికి వైసీపీ ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువే చేసిందని చెప్పారు. బయ్యర్లు బాగుంటేనే సినీ పరిశ్రమ బాగుంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సుందరమైన షూటింగ్ లొకేషన్లు ఉన్నాయని చెప్పారు. ఏపీలో స్టూడియోలను నిర్మించేలా సినీ ప్రముఖులు కృషి చేయాలని అన్నారు. సినిమాల్లోకి వెళ్లాలని తనకు ఓ మెకానిక్ సలహా ఇచ్చాడని, అందుకే తనకు మెకానిక్ లంటే చాలా ఇష్టమని తెలిపారు.
Go Back to Shorts
Suman
Tollywood
Jagan
YSRCP

More Telugu News