Cricket: శ్రీలంక-భార‌త్ మ్యాచ్‌: క‌డుపుబ్బా న‌వ్విస్తోన్న వీడియో ఇదిగో

cricket video viral
షార్ట్స్‌లో చూడండి
శ్రీలంక-భార‌త్ మ‌ధ్య నిన్న జ‌రిగిన రెండో టెస్టు తొలి రోజు ఆట‌లో భార‌త్ ఆధిక్య‌త ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతూ న‌వ్వులు పూయిస్తోంది. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో దనుంజయ డి సిల్వా డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించగా, బాల్ నేరుగా బ్యాటర్‌ ప్యాడ్‌కు తగిలింది. 

దీంతో భారత ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయ‌గా, అందుకు అంపైర్ తిరస్కరించాడు. వెంట‌నే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రివ్యూకు వెళ్లాడు. రీప్లేలో ఆది ఔట్‌గా తేలడంతో టీమిండియా మైదానంలో గంతులు వేసింది. ఆ స‌మ‌యంలో మహ్మద్‌ షమీ తలపై రవిచంద్రన్‌ అశ్విన్‌  తబలా వాయించాడు. షమీ కూడా తల ఊపడంతో న‌వ్వులు పూశాయి. 

Go Back to Shorts
Cricket
Viral Videos

More Telugu News