Sensex: ఎన్నికల ఫలితాల ప్రభావం.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Makets ends in profits on election results day
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్టుగా ఫలితాలు వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 817 పాయింట్లు లాభపడి 55,464కి చేరుకుంది. నిఫ్టీ 249 పాయింట్లు పెరిగి 16,594 వద్ద స్థిరపడింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (5.17%), టాటా స్టీల్ (4.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.70%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.28%), యాక్సిస్ బ్యాంక్ (3.04%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.28%), డాక్టర్ రెడ్డీస్ (-0.78%), టీసీఎస్ (-0.36%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News