'సలార్'కి హైలైట్ గా సముద్రంలోని ఫైట్!
- రిలీజ్ కి రెడీగా 'రాధేశ్యామ్'
- ముగింపు దశలో 'సలార్'
- కథానాయికగా శ్రుతి హాసన్
- స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్
ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు సముద్రంపై జరిగే ఛేజింగ్ .. సముద్రం లోపల జరిగే ఫైట్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయని అంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 20 కోట్లు ఖర్చు చేశారని సమాచారం.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయట. ఒక స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ ను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.