sensex: రష్యా, ఉక్రెయిన్ చర్చల వార్తల నేపథ్యంలో.. లాభాల్లోనే ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లు లాభాలను మూటగట్టుకోవడం గమనార్హం. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు నష్టాల్లోకి జారుకున్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ లు చర్చలకు సిద్ధమవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. 

దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 389 పాయింట్లు లాభపడి 56,247కి చేరుకుంది. నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 16,794 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (6.61), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (6.03), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.29), టైటాన్ (3.11), ఎన్టీపీసీ (2.46). 

టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.81), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.07), యాక్సిస్ బ్యాంక్ (-2.05), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.99), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.56).
Go Back to Shorts
sensex
Nifty
Stock Market

More Telugu News