Team India: శ్రీలంక కెప్టెన్ మెరుపు ఇన్నింగ్స్... టీమిండియా ముందు భారీ టార్గెట్

Sri Lanka set huge target for Team India
షార్ట్స్‌లో చూడండి
తొలి టీ20లో పేలవ ఆటతీరుతో ఓటమిపాలైన శ్రీలంక జట్టు రెండో టీ20లో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సాంక దూకుడు, కెప్టెన్ దసున్ షనక మెరుపుదాడి సాయంతో ఆ జట్టు స్కోరుబోర్డు పరుగులెత్తింది. 

టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా, శ్రీలంక జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ పత్తుం నిస్సాంక 53 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేయడం విశేషం. ఓవైపు వికెట్లు పడుతున్నా నిస్సాంక దూకుడుతో ఆ జట్టు స్కోరు ఎక్కడా తగ్గలేదు. మరో ఓపెనర్ ధనుష్క గుణతిలక 4 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులు చేశాడు. 

అయితే, చరిత్ అసలంక (2), కమిల్ మిషార (1), దినేశ్ చాందిమల్ (9) విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో, లోయరార్డర్ లో వచ్చిన కెప్టెన్ దసున్ షనక సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షనక స్కోరులో 2 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
Go Back to Shorts
Team India
Sri Lanka
Dasun Shanaka
2nd T20
Dharmashala

More Telugu News