'పుష్ప 2' కోసం లొకేషన్ల వేటలో సుకుమార్!

Pushpa 2 movie update
  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • బాలీవుడ్ లో 100 కోట్లకి పైగా వసూళ్లు
  • సీక్వెల్ కోసం మొదలైన సన్నాహాలు
  • కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. మైత్రీ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. అవే లొకేషన్స్ లో సెకండ్ పార్టును చిత్రీకరిస్తారని అంతా అనుకున్నారు. కానీ సుకుమార్ కొత్త లొకేషన్స్ కోసం సెర్చ్ చేస్తున్నాడట.

'పుష్ప' సినిమా బాలీవుడ్ లో 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది కనుక, ఈ సారి ఉత్తరాది లొకేషన్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారట. అంతేకాదు, ఒక బాలీవుడ్ స్టార్ హీరోను కూడా కీలకమైన పాత్ర కోసం తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ కారణంగా బాలీవుడ్ ప్రేక్షకులు మరింత ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువని భావిస్తున్నారు.

ఇక 'పుష్ప'లో స్మగ్లర్ గా ఎదుగుతూ కనిపించిన హీరో .. సెకండ్ పార్టులో స్మగ్లర్స్ కి పెద్ద తలకాయలా మారిపోయి, అందరినీ శాసించే స్థాయిలో కనిపిస్తాడట. ఆయన భార్య పాత్రలో రష్మిక కనిపించనుంది. అందుకు తగినట్టుగానే పాటలు . ఫైట్లు ఉంటాయని చెబుతున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa 2 Movie

More Telugu News