శ్రీలంక క్రికెటర్ కోసం రోడ్డెక్కిన అభిమానులు.. భానుక రాజపక్సకు చోటు కల్పించాలని డిమాండ్
- భారత్ టూర్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక
- భానుకకు దక్కని చోటు
- ప్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కిన అభిమానులు
ఇప్పుడీ వ్యవహారం శ్రీలంక క్రికెట్‌లో హాట్ టాపిక్ అయ్యింది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భానుక రాజపక్స అదరగొట్టాడు. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. శ్రీలంక తరపున 5 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. అయినప్పటికీ అద్భుత ఆటతీరుతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. అయితే, ఆ తర్వాత రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరి దృష్టిని మరోమారు ఆకర్షించాడు.