సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి... త్వరలో పూర్తి వివరాలు
- విడుదలకు సిద్ధంగా ఉన్న చిరంజీవి ఆచార్య
- మరో మూడు సినిమాలతో మెగాస్టార్ బిజీ
- చిరంజీవిని ఆయన నివాసంలో కలిసిన సుక్కు
- కలం నిజం కానుంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాక ఆయన భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.
కాగా, సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే ప్రాజెక్టు సినిమా కాదని, ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం యాడ్ మాత్రమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.