మహేశ్ మూవీలో సీనియర్ హీరోయిన్!

Trivikram and Mahesh Babu movie update
  • నిన్నతరం కథానాయిక శోభన
  • ఆమె కెరియర్లో 'రుద్రవీణ' స్థానం ప్రత్యేకం
  • నాగ్ 'రక్షణ' తరువాత తెలుగు తెరకి దూరం
  • త్రివిక్రమ్ మూవీతో రీ ఎంట్రీ  
త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతి సినిమాలోను సీనియర్ హీరోయిన్ తో ఒక కీలకమైన పాత్రను చేయిస్తుంటారు. ఆ పాత్రకి వాళ్లు నిండుదనాన్ని తీసుకువస్తారనే ఆలోచనతో పాటు, గతంలో వాళ్లకి గల క్రేజ్ ఆ సినిమాకి హెల్ప్ అవుతుందని ఆయన భావిస్తారు. అలా ఆయన నదియా .. స్నేహ .. ఖుష్బూ .. టబు వంటి సీనియర్ హీరోయిన్స్ కి కీలకమైన రోల్స్ ఇస్తూ వచ్చారు.

అలాగే ఈ సారి ఆయన సీనియర్ హీరోయిన్ శోభనను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో పిన్ని పాత్ర చాలా ముఖ్యమైనదిగా ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుందట. ఆ పాత్రకోసం శోభనను ఎంపిక చేశారని అంటున్నారు.

తెలుగులో హీరోయిన్ గా శోభన ఒక వెలుగు వెలిగారు. 'కోకిల' .. 'అభినందన' .. 'రుద్రవీణ' .. 'రౌడీగారి పెళ్ళాం' వంటి సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. 1993లో వచ్చిన 'రక్షణ' కథానాయికగా ఆమె చివరి సినిమా, ఆ తరువాత చాలా గ్యాప్ తరువాత ఆమె రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. శోభన అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే విషయమే.
Go Back to Shorts
Mahesh Babu
Pooja Hegde
Shobhana
Trivikram Movie

More Telugu News