బిగ్ బాస్ నుంచి తప్పుకున్న కమలహాసన్.. కారణం ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ నుంచి తప్పుకున్న కమలహాసన్.. కారణం ఇదే!

Kamal Haasan came out of Big Boss
  • 'విక్రమ్' సినిమా షూటింగ్ కోసం బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పిన కమల్
  • సినిమా, బిగ్ బాస్ షెడ్యూళ్ల మధ్య ఇబ్బంది
  • చివరి దశలో ఉన్న 'విక్రమ్' షూటింగ్
విలక్షణ నటుడు కమలహాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళ బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. తమిళ వర్షన్ బిగ్ బాస్ షోకు తొలి సీజన్ నుంచి ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనదైన శైలిలో షోను నడిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కమల్ అలరించారు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. బిగ్ బాస్ కు తాను దూరం కావాలనుకోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు.

తన చిత్రం 'విక్రమ్' షూటింగ్ పూర్తి చేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కమల్ తెలిపారు. వ్యక్తిగతంగా తాను ఈ షోకు ఎంతో కనెక్ట్ అయ్యానని... అయితే తొలి నుంచి 'విక్రమ్' సినిమా షూటింగ్, బిగ్ బాస్ షో షెడ్యూళ్ల మధ్య ఇబ్బంది రాకుండా పక్కాగా ప్లాన్ చేసుకున్నామని... అయితే కరోనా కారణంగా ప్లాన్ మొత్తం తలకిందులయిందని చెప్పారు. కరోనా నేపథ్యంలో షెడ్యూళ్లు మొత్తం మారిపోయాయని తెలిపారు.

ఇప్పుడు 'విక్రమ్' షూటింగ్ చివరి దశలో ఉందని... కీలకమైన నటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందని కమల్ చెప్పారు. మెయిన్ ఆర్టిస్టుల డేట్స్ మొత్తం కుదిరిన తర్వాత... బిగ్ బాస్ కారణంగా తాను సెట్లో ఉండకపోతే... అది కరెక్ట్ కాదని అన్నారు. ఇంతటి టైట్ షెడ్యూల్ లో సినిమా, బిగ్ బాస్ రెండింటినీ తాను మేనేజ్ చేయడం కష్టసాధ్యమని... అందుకే బిగ్ బాస్ నుంచి తప్పుకున్నానని చెప్పారు.
Kamal Haasan
Tollywood
Kollywood
Bigg Boss
Vikram Movie

More Telugu News