మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్లాలనుకుంటున్నారా... రేట్ల వివరాలు ఇవిగో!
- రేపటి నుంచి మేడారం జాతర
- హెలికాప్టర్లు నడపనున్న తంబి ఏవియేషన్
- హనుమకొండ నుంచి మేడారంకు హెలికాప్టర్లు
- రానుపోను ఒక్కొక్కరికి రూ.19,999
హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్లు నడపనుంది. ఒకరికి రానుపోను చార్జీలు రూ.19,999 అని వెల్లడించారు. అదే, హైదరాబాద్ నుంచి మేడారంకు రూ.75,000 చెల్లించాలి. మేడారం జాతర విహంగ వీక్షణం కోసం మరో రూ.3,700 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం నుంచి హెలికాప్టర్ సేవలు షురూ అవుతాయి.