తెలంగాణలో కొత్తగా 733 కొవిడ్ పాజిటివ్ కేసులు
- తెలంగాణలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 56,487 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 185 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
అదే సమయంలో 2,850 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,82,336 మంది కరోనా బారినపడగా, వారిలో 7,62,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,636 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,106కి పెరిగింది.
