'శ్రీవల్లి' పాటను అద్భుతంగా ఆలపించిన నెదర్లాండ్స్ గాయని... వీడియో చూసి ఫిదా అయిన దేవీ శ్రీప్రసాద్

Dutch singer Emma Heesters sings Sreevalli song
  • 'పుష్ప' చిత్రంలో సూపర్ హిట్టయిన 'శ్రీవల్లి' సాంగ్
  • దేశాల సరిహద్దులు దాటి అలరిస్తున్న గీతం
  • ఇంగ్లీషు, తెలుగులో పాడిన ఎమ్మా హీస్టర్స్
  • వీడియో పంచుకున్న దేవి శ్రీప్రసాద్
'పుష్ప' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో, అందులోని 'శ్రీవల్లి' పాట అంతకంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ పాట ఖండాంతరాలు దాటి యూరప్ లోనూ మోత మోగిస్తోంది. తాజాగా 'శ్రీవల్లి' పాటను నెదర్లాండ్స్ కు చెందిన ప్రముఖ గాయని ఎమ్మా హీస్టర్స్ అద్భుతంగా ఆలపించి, ఆ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేసింది. శ్రీవల్లి పాట ప్రారంభంలో ఇంగ్లీషు లిరిక్స్ కూడా జోడించింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పుష్ప సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ దృష్టికి వచ్చింది. ఆయన ఈ వీడియో చూసి ముగ్ధుడయ్యారు. "హేయ్ సిద్ శ్రీరామ్ బ్రో... ఈ పాట రికార్డు చేస్తున్నప్పుడు శ్రీవల్లి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చేయాలని మనం అనుకున్నాం కదా... అయితే ఈ పాటకు అద్భుతమైన కవర్ సాంగ్ వచ్చింది... ఇదిగో!" అంటూ ఎమ్మా హీస్టర్స్ పాడిన పాట తాలూకు వీడియోను కూడా పంచుకున్నారు.
Go Back to Shorts
Emma Heesters
Dutch Siunger
Sreevalli
Pushpa
Devi Sri Prasad

More Telugu News