సర్కారు వారి పాట నుంచి 'కళావతి' సాంగ్... మహేశ్ బాబు అభిమానులకు వాలెంటైన్స్ డే కానుక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సర్కారు వారి పాట నుంచి 'కళావతి' సాంగ్... మహేశ్ బాబు అభిమానులకు వాలెంటైన్స్ డే కానుక

Kalavathi song set to release on Valentines Day from Mahesh Babu Sarkaru Vaari Paata
  • పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు
  • మే 12న రిలీజవుతున్న సర్కారు వారి పాట
  • ప్రేమికుల రోజున తొలిపాట విడుదల
  • బాణీలు అందించిన తమన్
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలకు రంగం సిద్ధమైంది. 'కళావతి' అనే గీతాన్ని ఈ నెల 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. "వాలెంటైన్స్ డే రోజున 'కళావతి'తో ప్రేమలో పడండి" అంటూ ఓ ప్రకటన చేసింది.

మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సర్కారు వారి పాట చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
Kalavathi
First Single
Sarkaru Vaari Paata
Mahesh Babu
Valentines Day
Thaman

More Telugu News