Sensex: బడ్జెట్ రోజున భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. మెటల్ ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ సూచీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడి 58,862కి చేరుకుంది. నిఫ్టీ 237 పాయింట్లు పెరిగి 17,576కి ఎగబాకింది. ఈరోజు 1,683 షేర్లు అడ్వాన్స్ కాగా... 1,583 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 98 షేర్లు ఎలాంటి మార్పు చెందలేదు.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (7.57%), సన్ ఫార్మా (6.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.76%), ఎల్ అండ్ టీ (4.31%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.13%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.13%), భారతి ఎయిర్ టెల్ (-0.91%), ఎన్టీపీసీ (-0.60%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News