రామ్‌ చరణ్ భార్య‌ ఉపాసన పోస్ట్ చేసిన ఫొటో చూసి మండిప‌డుతోన్న నెటిజ‌న్లు

netizens slam upasana
  • గుడి గోపురం ఫొటో పోస్ట్
  • మ‌నుషుల‌తో రూపొందించిన ఫొటో
  • తాను, చెర్రీ కూడా ఉన్నామ‌న్న ఉపాస‌న‌
సినీ న‌టుడు రామ్‌ చరణ్ భార్య‌ ఉపాసన‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో యాక్టివ్ గా ఉండే ఉపాస‌న ఆస‌క్తిక‌ర ఫొటోలు పోస్ట్ చేస్తూ వుంటారు. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌ని నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సందర్భంగా నిన్న ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఓ గుడి గోపురం ఫొటోని షేర్‌ చేశారు.
                          
అయితే, కొంతమంది ప్రజల విగ్ర‌హాలు ఆ గోపురానికి ఉన్న‌ట్లు ఆ ఫొటో ఉంది. అంతేగాక‌, ఆ ఫొటోలో తనతో పాటు రామ్‌ చరణ్‌ కూడా ఉన్నాడంటూ ఉపాస‌న పేర్కొన్నారు. ఆ ఫొటోలో తాము ఎక‍్కడ ఉన్నామో కనిపెట్టాల‌ని ఆమె కోరింది.

అయితే, దేవుళ్ల విగ్ర‌హాలు ఉండాల్సిన గోపురంపై మ‌నుషులు ఉన్న‌ట్లు ఫొటో రూపొందించ‌డం ఏంటంటూ నెటిజ‌న్లు ఆమెపై మండిప‌డుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె ఫొటో, వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని అంటున్నారు.
Go Back to Shorts
upasana
Ramcharan
Tollywood

More Telugu News