Sensex: కుప్పకూలిన మార్కెట్లు.. ఏకంగా 1,545 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

Sensex looses 1545 points
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్ లో కూడా నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు మొగ్గుచూపడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు... ఆ తర్వాత ఏ సమయంలోనూ పుంజుకోలేకపోయాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,545 పాయింట్లు పతనమై 57,491కి దిగజారింది. నిఫ్టీ 468 పాయింట్లు కోల్పోయి 17,149కి పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఈరోజు అన్ని షేర్లు నష్టపోయాయి. టాటా స్టీల్ (-5.98%), బజాజ్ ఫైనాన్స్ (-5.97%), విప్రో (-5.35%), టెక్ మహీంద్రా (-5.14%), టైటాన్ (-5.05%) రిలయన్స్ ఇండస్ట్రీస్ (-4.06%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News