అఖిలేశ్ కు మద్దతుగా మరో ప్రాంతీయ పార్టీ.. రంగంలోకి బెంగాల్ దీది మమతా బెనర్జీ
- యూపీలో పోటీ చేయకూడదని నిర్ణయం
- ఎస్పీ చీఫ్ అఖిలేశ్ తో కలసి మమత ప్రచారం
- లక్నో, వారణాసిలో వర్చువల్ సభలు
- పార్టీ వైస్ ప్రెసిడెంట్ నందా ప్రకటన
కిరణ్మయి నందా యూపీకి వెళ్లి ఇదే విషయమై ఎస్పీతో చర్చించిన అనంతరం బెంగాల్ కు తిరిగొచ్చి పార్టీ అధినేత్రితో సమావేశమయ్యారు. అనంతరం ప్రకటన చేశారు. ‘‘యూపీలో తృణమూల్ కాంగ్రెస్ పోటీకి దిగదు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తాం. లక్నో, వారణాసి సభల్లో అఖిలేశ్ యాదవ్ తో కలసి దీది ప్రచారం నిర్వహిస్తారు’’ అని తెలిపారు. ఫిబ్రవరి 8న లక్నో సభ ఉంటుందని, వారణాసి సభ తేదీ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ బలమైన నాయకురాలని, బెంగాల్ లో బీజేపీని ఓడించిన తీరు ప్రతిపక్షాలు అన్నింటికీ ఒక పాఠం వంటిదన్నారు.