టీమిండియా క్రికెటర్లలో 'పుష్ప' మేనియా... 'శ్రీవల్లి' పాటకు డ్యాన్స్ చేసిన క్రికెటర్లు
- ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప
- బన్నీ డైలాగులు, పాటలు సూపర్ హిట్
- బన్నీ పెర్ఫార్మెన్స్ కు క్రికెటర్లు ఫిదా
- తాజాగా వీడియో పంచుకున్న పుష్ప టీమ్
కాగా, ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టే. ముఖ్యంగా శ్రీవల్లి పాటకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. తాజాగా టీమిండియా క్రికెటర్లు శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేశారు. ఈ పాటలో అల్లు అర్జున్ ఓ స్టెప్పు వేస్తూ చెప్పు జారవిడుచుకుంటాడు. ఇప్పుడదే స్టెప్పును టీమిండియా ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను పుష్ప చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.