Gopichand: కొత్త పోస్టర్ తో అదరగొట్టేసిన గోపీచంద్!

  • మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్'  
  • గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా
  • యూవీ - గీతా ఆర్ట్స్ 2 సంయుక్త నిర్మాణం 
  • త్వరలోనే థియేటర్లకు రానున్న సినిమా
Pakka Commercial Special Poster Released

గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' సినిమాను రూపొందించాడు. గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, మారుతి మార్కు కామెడీ కలిసిన కథ ఇది. గోపీచంద్ ను ఫ్రెష్ లుక్ తో ఈ సినిమాలో మారుతి చూపించనున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. మరింత యంగ్ గా .. హ్యాండ్సమ్ గా ఈ పోస్టర్ లో గోపీచంద్ కనిపిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా అలరించనుంది.

గతంలో గోపీచంద్ - రాశి ఖన్నా కాంబినేషన్లో వచ్చిన 'జిల్' భారీ విజయాన్ని అందుకుంది. ఇక మారుతి దర్శకత్వంలో రాశి ఖన్నా చేసిన 'ప్రతి రోజూ పండగే' సినిమా కూడా బాగానే ఆడింది. అలా హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తాజా పోస్టర్ ద్వారా వెల్లడించారు.

More Telugu News