కేప్ టౌన్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 223 ఆలౌట్
- టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్టు
- కేప్ టౌన్ లో జరుగుతున్న మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- కోహ్లీ 79 పరుగులు.. రబాడాకు 4 వికెట్లు
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆరంభంలోనే కెప్టెన్ డీన్ ఎల్గార్ (3) వికెట్ కోల్పోయింది. ఎల్గార్ ను బుమ్రా అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఐడెన్ మార్ క్రమ్ (8 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (6 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు దక్షిణాఫ్రికా ఇంకా 206 పరుగులు వెనుకబడి ఉంది.