అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష.. కారణం ఇదే!
- మయన్మార్ లో కొనసాగుతున్న సైనిక పాలన
- వాకీటాకీని అక్రమపద్ధతిలో దిగుమతి చేసుకున్నారంటూ సూకీపై కేసు
- కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ మరో కేసు
తాజాగా ఆమెపై ఉన్న కేసులను విచారించిన కోర్టు ఈ జైలు శిక్షను విధించింది. వాకీటాకీని అక్రమ పద్ధతిలో దిగుమతి చేసుకున్నారనే కేసు, కరోనా నిబంధనలను ఉల్లంఘించారనే కేసులు ఆమెపై మోపడం జరిగింది. ఈ రెండు కేసుల్లోనే ఆమెకు ఇప్పుడు శిక్ష విధించారు.
మరోవైపు సూకీని అధికారం నుంచి తప్పించి, నిర్బంధించిన వెంటనే ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. 76 ఏళ్ల సూకీకి మద్దతుగా సైన్యానికి వ్యతిరేకంగా ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలను సైనిక ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 1,400కు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.