ఆస్ట్రేలియాలో ఆచూకీ లేకుండా పోయిన హైదరాబాద్ విద్యార్థి
- 2018లో ఆస్ట్రేలియా వెళ్లిన మహ్మద్ మాజ్
- మాస్టర్స్ డిగ్రీ కోసం మెల్బోర్న్ వర్సిటీలో చేరిక
- గత 10 రోజులుగా మిస్సింగ్
- తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
అతడి ఆచూకీ కోసం ఆస్ట్రేలియాలోని విక్టోరియా పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. ఆసుపత్రుల్లో అతడి వివరాల కోసం వాకబు చేస్తున్నారు. ప్రమాద ఘటనలకు సంబంధించిన కేసుల్లోనూ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎక్కడా అతడి వివరాలు లభ్యం కాలేదు. ప్రమాద ఘటనల్లో తమ కుమారుడి వివరాలు లేకపోవడంతో, మహ్మద్ తండ్రి తన కుమారుడు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండి ఉంటాడన్న నమ్మకం కలుగుతోందని అన్నారు.
మహ్మద్ బంధువులు ఎంబీటీ పార్టీ నేత, సామాజిక కార్యకర్త అంజాద్ ఉల్లా ఖాన్ సాయంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అర్థించారు. మహ్మద్ ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.