తిరుమలలో నకిలీ దర్శన టికెట్ల దందా... ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు
- మధ్యప్రదేశ్ కు చెందిన భక్తుల వద్ద నకిలీ టికెట్లు
- గుర్తించిన విజిలెన్స్ అధికారులు
- నకిలీ టికెట్లను తయారుచేస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్
- మూడు టికెట్లను రూ.21 వేలకు అమ్మిన వైనం
ఆ కానిస్టేబుల్ మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు భక్తులకు ఈ టికెట్లను రూ.21 వేలకు విక్రయించినట్టు గుర్తించారు. వాస్తవానికి అసలు టిక్కెట్ టికెట్ ధర రూ.300 మాత్రమే. దర్శనానికి వచ్చిన మధ్యప్రదేశ్ భక్తుల వద్ద నకిలీ టికెట్లు ఉండడంతో విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది.
అనంతరం సదరు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. టికెట్ స్కానింగ్, లడ్డూ కౌంటర్ వద్ద పనిచేసే మరో ఇద్దరు ఉద్యోగులు ఈ నకిలీ టికెట్ల దందాలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కు సహకరించినట్టు గుర్తించారు. ఈ వ్యవహారం ఎప్పటినుంచి సాగుతోందన్న దానిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.