Allu Arjun: బోయపాటి మూవీలో బన్నీ ద్విపాత్రాభినయం!

  • 'పుష్ప'తో హిట్ కొట్టిన బన్నీ 
  • వచ్చేనెల నుంచి 'పుష్ప 2' షూటింగ్ 
  • ఆ తరువాత ప్రాజెక్టు బోయపాటితో 
  • గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం   
Allu Arjun in Boyapati movie

అల్లు అర్జున్ హీరోగా ఇటీవల వచ్చిన 'పుష్ప' సినిమా సంచలనం విజయాన్ని సాధించింది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. 'పుష్ప 2' ఇంతకుమించి ఉంటుందని చెబుతున్న సుకుమార్, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నాడు. ప్రస్తుతం ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 ఇక ఈ సినిమా తరువాత బోయపాటితో బన్నీ ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి. 'పుష్ప 2'లో బన్నీ పోర్షన్ పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ  సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు.

ఒక పాత్రలో బన్నీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని చెబుతున్నారు. మరో పాత్ర ఏమిటనేది మాత్రం తెలియాల్సివుంది. ఇక ఈ రెండు పాత్రల సరసన కథానాయికలుగా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది ఆసక్తికరంగా మారనుంది. 'సరైనోడు' తరువాత రానున్న ఈ కాంబినేషన్ లో సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

More Telugu News