అయ్యప్ప మాల వేసుకున్న బాలీవుడ్ స్టార్
Add ap7am to your home Screen

అయ్యప్ప మాల వేసుకున్న బాలీవుడ్ స్టార్

Ajay Devgn took Ayyappa Deeksha
  • అయ్యప్ప మాల వేసుకున్న అజయ్ దేవగణ్
  • జ్యోతిష్కుడు బాలు మున్నంగి వల్ల మాలధారణ
  • ముంబైకి వెళ్లి మాలధారణ చేయించిన గురుస్వామి వెంకటరెడ్డి
దక్షిణాదిన అయ్యప్పస్వామిని ఎంతో భక్తి భావంతో కొలుస్తారు. అయ్యప్ప మాలను ధరించి ఎంతో నిష్ఠతో భక్తులు ఉంటారు. సినీ పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు కూడా అయ్యప్ప మాల ధరిస్తుంటారు. టాలీవుడ్ లో చిరంజీవి, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, శర్వానంద్ వంటి ఎంతో మంది అయ్యప్ప మాల ధరిస్తుంటారు.

ఇప్పుడీ భక్తి బాలీవుడ్ కి కూడా విస్తరించింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ అయ్యప్ప మాలను ధరించారు. దక్షిణాది జ్యోతిష్కుడు బాలు మున్నంగి వల్లే ఆయన మాల వేసుకున్నారు. గురుస్వామి వెంకటరెడ్డి ముంబైకి వెళ్లి అజయ్ దేవగణ్ తో మాలధారణ చేయించారు. అజయ్ మాల వేసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ajay Devgn
Ayyappa Mala
Bollywood

More Telugu News