Nani: నైజామ్ లో 'శ్యామ్ సింగ రాయ్' తొలిరోజు వసూళ్లు!

  • 'శ్యామ్ సింగ రాయ్'గా నాని 
  • బెంగాలీ యువతిగా సాయిపల్లవి 
  • నిన్ననే రిలీజ్ అయిన సినిమా
  • తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్
Shyam Singha Roy movie update

నాని హీరోగా రూపొందిన 'శ్యామ్ సింగ రాయ్' నిన్ననే థియేటర్లకు వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి సందడి చేశారు. 70వ దశకంలో కలకత్తాలోని దేవదాసీ వ్యవస్థ ప్రధానంగా సాగే కథ ఇది. ఆ దురాచారాన్ని ప్రశ్నించే కథానాయకుడిగా 'శ్యామ్ సింగ రాయ్' కనిపిస్తాడు.

ఆ దేవదాసీ పాత్రలో సాయిపల్లవి కనిపిస్తుంది. ఈ ఇద్దరి లుక్స్ కూడా బెంగాలీ ప్రాంతానికి చెందినవిగానే ఉంటాయి. ఇటు నాని లుక్ .. అటు సాయిపల్లవి లుక్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. తొలి రోజునే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది.
నైజామ్ లో ఈ సినిమా తొలి రోజున 1.6 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.

ఈ సినిమా డీసెంట్ గా ఉందనే టాక్ వచ్చిందంటూ టీమ్ సందడి చేసింది. క్రిస్మస్ రోజున .. ఆదివారం రోజున వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతామనే నమ్మకంతో నాని ఉన్నాడు. ఆయన నమ్మకం నిజమవుతుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News