'ఏజెంట్' డేట్ మారినా దూకుడు మారదు!

Agent movie update
  • 'ఏజెంట్' గా అఖిల్ అక్కినేని
  • దర్శకుడిగా సురేందర్ రెడ్డి  
  • కీలకమైన పాత్రలో మమ్ముట్టి
  • కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను, డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే చెప్పారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరిగితే, నిజంగానే ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేదే.

కరోనా కారణంగానే తమ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోవలసి వచ్చిందని, రామబ్రహ్మం సుంకర ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 'ఏజెంట్' డేట్ మారినా .. దర్జా మారదు .. దూకుడు మారదు. ప్రపంచస్థాయి గూఢచారి సినిమాలతో సమానంగా మా సినిమా ఉంటుంది. ఇది వరల్డ్ క్లాస్ రేంజ్ మాస్ యాక్షన్ మూవీ. మీ అంచనాలకి తగినట్టుగా ఈ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.

హిప్ హాప్ తమిళ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతోనే సాక్షి వైద్య తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది. డిఫరెంట్ లుక్ తో అఖిల్ కనిపించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Go Back to Shorts
Akhil Akkineni
Sakshi Vaidya
Mammootty
Agent Movie

More Telugu News