Sensex: నేడు కూడా లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
అంతర్జాతీయంగా సానుకూలతలు ఉన్న నేపథ్యంలో మన దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు లాభాలను ముందుండి నడిపించాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 385 పాయింట్లు లాభపడి 57,315కి పెరిగింది. నిఫ్టీ 117 పాయింట్లు పుంజుకుని 17,072 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.40%), ఐటీసీ (2.48%), బజాజ్ ఫైనాన్స్ (2.12%), ఇన్ఫోసిస్ (1.77%), ఎన్టీపీసీ (1.67%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-0.93%), సన్ ఫార్మా (-0.80%), మారుతి (-0.57%), అల్ట్రాటక్ సిమెంట్ (-0.56%), ఏసియన్ పెయింట్స్ (-0.27%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News