'ఆచార్య' నుంచి న్యూ ఇయర్ స్పెషల్!

Acharya movie update
  • 'ఆచార్య'గా చిరంజీవి
  • సిద్ధ పాత్రలో చరణ్
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ  
  • ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్  
చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' రూపొందింది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, యువ జంటగా చరణ్ - పూజ హెగ్డే కనిపించనున్నారు. 'సిద్ధ' అనే పవర్ఫుల్ పాత్రలో చరణ్ కనిపించనుండగా, 'నీలాంబరి' అనే గ్రామీణ యువతి పాత్రలో .. లంగా ఓణీలో పూజ హెగ్డే కనువిందు చేయనుంది.

ఇటు చిరంజీవి నుంచి వదిలిన 'లాహే లాహే' సాంగ్, అటు చరణ్ - పూజ హెగ్డే కాంబినేషన్లో వదిలిన 'నీలాంబరి' సాంగ్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయాయి. మణిశర్మ ట్యూన్స్ కి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో న్యూఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్ డేట్ ను వదలనున్నట్టు చెప్పుకుంటున్నారు. చిరంజీవి - చరణ్ లకి సంబంధించిన కీలకమైన అంశాలతో కూడిన ఒక ట్రైలర్ ను గానీ .. ఇద్దరిపై చిత్రీకరించిన పాటను గాని వదిలే అవకాశం ఉందని అంటున్నారు. మేకర్స్ ఎలా ప్లాన్ చేశారో చూడాలి మరి..
Go Back to Shorts
Chiranjeevi
Ramcharan
Kajal Agarwal
Pooja Hegde
Acharya Movie

More Telugu News