Nani: రీమేకులు చేయనుగాక చేయను: నాని

Shyam Singha Roy movie update
టాలీవుడ్ లో కొంతమంది యంగ్ హీరోలు .. ఏ భాషలో ఏ సినిమా హిట్ అయిందా అనే విషయంపై ఒక కన్నేసి ఉంచుతున్నారు. సొంత నిర్మాణ సంస్థలు ఉన్నవారు తామే రైట్స్ తీసుకుంటున్నారు. లేనివారు తమకి బాగా టచ్ లో ఉండే నిర్మాతలతో ఆ సినిమాల రీమేక్ హక్కులు కొనిపిస్తున్నారు .. ఆ వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు.

నాని మాత్రం రీమేక్ సినిమాల వైపు చూడటం లేదు .. అసలు ఆ వైపు మెడ కూడా తిప్పడం లేదు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమా ప్రమోషన్స్ లో ఉన్న ఆయనకి ఈ విషయాన్ని గురించిన ప్రశ్న ఎదురైంది. అందుకు నాని స్పందిస్తూ, గతంలో తను చేసిన రెండు రీమేకులు తనకి పాఠం నేర్పడం వలన ఆ వైపు వెళ్లదలచుకోలేదని చెప్పాడు.

రీమేకులు తనకి అంతగా సెట్ కావనే విషయం తనకి అర్థమైపోయిందని అన్నాడు. తాను రీమేకులలో చేయడం కంటే, తన సినిమాలు రీమేక్ అవుతుండటం తనకి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఇకపై కూడా రీమేకులు చేసే ఆలోచన లేదనే విషయాన్ని స్పష్టం చేశాడు. మొత్తానికి నాని రీమేకుల విషయంలో గట్టి నిర్ణయమే తీసుకున్నాడన్న మాట.
Nani
Sai Pallavi
Krithi Shetty
Shyam Singa Roy Movie

More Telugu News