Paritala Sriram: ఆయన పార్టీ టికెట్ సంపాదించుకుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా: పరిటాల శ్రీరామ్ సవాల్

Paritala Sriram said he will leave politics if ex mla get ticket
షార్ట్స్‌లో చూడండి
ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని దుర్గానగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన గౌరవసభ-ప్రజా సమస్యలపై చర్చావేదిక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్ మాట్లాడుతూ.. ధర్మవరంలో టీడీపీ టికెట్ తెచ్చుకుంటానని ఓ నాయకుడు ప్రచారం చేసుకుంటున్నారని, నిజంగానే ఆయన టికెట్ తెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని ఓ  మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అయినా, టీడీపీ కార్యకర్తలు ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరు దృష్టిసారించాలని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్ అని, ఈ విషయాన్ని ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని పరిటాల శ్రీరామ్ కోరారు.
Go Back to Shorts
Paritala Sriram
TDP
Dharmavaram
Andhra Pradesh
Anantapur District

More Telugu News