ఆ క్షణంలో నటించడం మరిచిపోయాను: నాని
- రాహుల్ టాప్ డైరెక్టర్ అవుతాడు
- కృతి శెట్టికి మంచి భవిష్యత్తు ఉంది
- సాయిపల్లవి డాన్స్ అదరగొట్టేసిందన్న నాని
- కథపై తనకు నమ్మకం ఉందని వ్యాఖ్య
"ఈ సినిమా కోసం రాహుల్ చాలా కష్టపడ్డాడు. టాప్ డైరెక్టర్ కాగల సత్తా ఆయనకి ఉందనే విషయాన్ని ఈ సినిమా చెబుతుంది. కృతి శెట్టి కొత్తగా వచ్చింది .. ఈ పాత్రను ఎలా చేస్తుందో అనుకున్నాను. తన పాత్రపై పూర్తి ఎఫర్ట్ పెట్టి అద్భుతంగా చేసింది. తనకి మంచి భవిష్యత్తు ఉంది.
ఇక ఈ సినిమాలో పల్లవి డాన్స్ చేస్తుంటే .. నేను జనంలో నుంచి చూస్తుండాలి. ఆమె డాన్స్ చూస్తూ నటించడం మరిచిపోయాను .. నటించవలసిన అవసరం రాలేదు. అంతగా ఆశ్చర్యపోయి చూస్తుండిపోయాను. పెద్ద సినిమాలకి దగ్గరలో మా సినిమా వస్తున్నా మాకు భయం లేదు. ఎందుకంటే ఈ కథపై మాకు ఉన్న నమ్మకం అలాంటిది" అని చెప్పుకొచ్చాడు.