'ఆచార్య' రోజునే రంగంలోకి సూర్య!
- సూర్య తాజా చిత్రంగా 'ఈటి'
- దర్శకుడిగా పాండిరాజ్
- కథానాయికగా ప్రియాంక మోహన్
- ఫిబ్రవరి 4వ తేదీన విడుదల
సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళనాట విలక్షణ దర్శకుడిగా పాండిరాజ్ కి పేరు ఉంది. గతంలో ఆయన దర్శకత్వంలో సూర్య నటించాడు కూడా. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. తమిళంతో కలుపుకుని 5 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. ఇదే పేరుతో ఇదే రోజున ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. అయితే ఆ రోజున 'ఆచార్య' విడుదల అవుతుంది. సూర్య ధైర్యం చేసే దిగుతున్నాడని అనుకోవాలి. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, సూరి .. వినయ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.