టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: నారా లోకేశ్
- కర్నూలు జిల్లాలో ఘటన
- టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి
- గతంలోనూ రెండుసార్లు హత్యాయత్నం చేశారన్న లోకేశ్
- తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని డిమాండ్
గతంలోనూ తిక్కారెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని, కానీ పోలీసులు కనీస భద్రత కల్పించకపోవడం పలు అనుమానాలు కలిగిస్తోందని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, టీడీపీ నేత తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కత్తిని నమ్ముకున్నవాడు కత్తికి బలవ్వక తప్పదని చరిత్ర చెబుతోందని, ఈ సత్యాన్ని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.
ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రతిపక్ష నేతలను హతమార్చడానికా? అంటూ సీఎం జగన్ పై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా ఉండాల్సిన మీరు ఫ్యాక్షన్ రాజకీయాలను వదులుకోకపోవడం మీలోని మానసిక రుగ్మతను బయటపెడుతోందని వ్యాఖ్యానించారు.